కేజ్రీవాల్, మనీష్ సిసోడియా విచారణకు ఈడీకి అనుమతి.. ఎన్నికల వేళ ఆప్ కు కొత్త తలనొప్పి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆప్ ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆప్ కు ఇప్పుడు మరో తలనొప్పి వచ్చి పడింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ పార్టీ అగ్రనేతలు, మాజీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను విచారించేందుకు హోంమంత్రిత్వ శాఖ ఈడీకి అనుమతి ఇచ్చింది.  ఈ కేసులో ఈ ఇరువురూ అరెస్టై ఇప్పుడు బెయిలుపై ఉన్న సంగతి తెలిసిందే.  

ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేజ్రీవాల్‌ను విచారించేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కి అనుమతి మంజూరు చేసింది. వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల విచారణకు ఈడీ రంగంలోకి దిగడం కచ్చితంగా ఆప్ కు ఇబ్బంది కరమైన విషయమే.