డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్
posted on Aug 12, 2024 5:29PM
హైద్రాబాద్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో ఎ4 నిందితుడుగా ఉన్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ హీరో రాజ్ తరుణ్, మరో నటి లావణ్య వివాదంలో రోజుకో మలుపు తిరిగి మస్తాన్ సాయి పేరు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో మస్తాన్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారమందింది. డ్రగ్స్ కేసులో పెడలర్ గా పోలీసులు గుర్తించారు. గత జూన్ నెలలో విజయవాడలో డ్రగ్స్ తో పట్టుబడ్డ మస్తాన్ సాయిని ఇవ్వాళ పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి విజయవాడకు కొకైన్ తీసుకు వస్తుండగా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. 30 ఎంజీ కొకైన్ దొరికిందని పోలీసులు తెలిపారు. విజయవాడలో పట్టుబడ్డ కొకైన్ కేసు నుంచి తప్పించుకుంటున్న మస్తాన్ సాయి ఎట్టకేలకు పట్టుబడ్డారు. అంతే కాదు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో కూడా మస్తాన్ సాయి నాలుగో నిందితుడు. మస్తాన్ సాయిపై గతంలో లావణ్య గుంటూరులో రేప్ కేసు పెట్టింది. మస్తాన్ సాయి కొందరు అమ్మాయిల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆరోపణలున్నాయి.