జోహో వ్యవస్థాపకుడి అత్యంత ఖరీదైన విడాకులు
posted on Jan 13, 2026 3:24PM

టెక్ దిగ్గజం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు తన విడాకుల వ్యవహారంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. తన భార్య ప్రమీలా నాయర్‌తో విడిపోతున్న సందర్భంగా సెటిల్‌మెంట్ కింద ఆయన దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన ఆస్తులను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలవడమే కాకుండా.. ప్రపంచంలోనే నాలుగో అత్యంత భారీ సెటిల్‌మెంట్‌గా రికార్డులకెక్కింది.
బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల జాబితాలోకి ఇప్పుడు శ్రీధర్ వేంబు పేరు చేరింది. శ్రీధర్ వేంబు, ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య గత కొన్నేళ్లుగా సాగుతున్న విడాకుల పోరాటం కీలక మలుపు తిరిగింది. విడాకుల ప్రక్రియ కొనసాగుతుండగానే.. ప్రమీల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు శ్రీధర్ వేంబును 1.7 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 15,000 కోట్లుల విలువైన బాండ్‌ను కోర్టులో డిపాజిట్ చేయాలని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల తర్వాత నాలుగో అత్యంత ఖరీదైన విడాకుల కేసుగా ఈ కేసు రికార్డు సృష్టించింది.ప్రస్తుతం శ్రీధర్ వేంబు నికర ఆస్తి విలువ సుమారు 5.85 బిలియన్ డాలర్లుగా అంచనా. కాలిఫోర్నియా కోర్టు ఈ బాండ్ ఆర్డర్‌తో పాటు జోహోకు చెందిన కొన్ని అమెరికా విభాగాలపై పర్యవేక్షకుడిని కూడా నియమించింది. శ్రీధర్ వేంబు తరపు లాయర్లు ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లారు. మరి ఈ బిలియన్ డాలర్ల వివాదం చివరకు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.