మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు షాక్...

 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన పార్టీ నేతలు లంచాలు తీసుకుంటున్నట్టు ఓ ఛానల్ సీడీలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ఇప్పటికే కలకత్తా హైకోర్టులో జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ కేసులో విచారణను సీబీఐకి అప్పగించాలని హైకోర్టు నిర్ణయించింది. 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ... అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని పేర్కొంది. ఇప్పుడు హైకోర్టు నిర్ణయంపై స్పందించిన మమతా బెనర్జీ దీనిపై ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తానని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu