కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు అరెస్ట్
posted on Jan 8, 2016 10:40AM

కల్తీ మద్యం కేసు ఏ9 నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లాది విష్ణును పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల నుండి సిట్ అధికారులు మల్లాది విష్ణువును విచారిస్తున్న సంగతి తెలిసిందే. మల్లాది విష్ణువు తో పాటు ఇంకా స్వర్ణ బార్ లైసెన్స్‌దారుల్లో విష్ణు తల్లి త్రిపురసుంరమ్మ మినహా భాగవతుల శరశ్చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కెఎ లక్ష్మిని కూడా పిలిపించిన సిట్ అధికారులు కృష్ణలంక పోలీసు స్టేషన్‌లోని ప్రత్యేక గదిలో విష్ణుతో పాటు మిగిలినవారిని ఎదరెదురుగా కూర్చోబెట్టి విచారించారు. కానీ మల్లాది విష్ణువు చెప్పిన సమాధానాలకు.. వాళ్లు చెప్పిన సమాధానాలకు పొంతన కుదరకపోవడంతో సిట్ అధికారులు విష్ణువును అరెస్ట్ చేశారు. విష్ణుతో పాటు ఆయన సోదరుడు శ్రీనివాస్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగామల్లాది సోదరుల అరెస్ట్ తో విజయవాడలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా ఈరోజు మధ్యాహ్నం లోపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.