జీహెచ్ఎంసీ ఎన్నికల గడువు పెంపు..

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు జీహెచ్ఎంసీ ఎన్నికలు 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్న జీవో నిలుపుదల చేస్తూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల గడువు పెంచింది. దీనికి శనివారం లోగా రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిచేస్తామని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు 31 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్న ఈసీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా ఎన్నికల ప్రక్రియపై శశిథర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని.. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా కుట్ర పన్నిందని విమర్శించారు. చివరి వరకూ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వలేదని..రిజర్వేషన్లు ఇచ్చాక 45 రోజులు గడువు కోరాం.. మేం కోరిన గడువు హైకోర్టు ఇచ్చిందని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu