12న దేవేంద్ర ఫడణవిస్ బలపరీక్ష
posted on Nov 3, 2014 9:41AM
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ ప్రభుత్వ బలపరీక్ష ఈనెల 12వ తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరుగనుంది. మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన రాష్ట్ర శాసనసభలో తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీ (123)గా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు (145)ను దక్కించుకోలేకపోయింది. బయటి నుంచి మద్దతిచ్చేందుకు ఎన్సీపీ చేసిన బేషరతు మద్దతును ప్రకటించినప్పటికీ.. కమలనాథులు మాత్రం నోరుమెదపడం లేదు. మరోవైపు... చిరకాల మిత్రపక్ష పార్టీ శివసేనతోనే కలిసి నడిచేందుకు చర్చలు జరుపుతున్నారు. ఎటొచ్చి ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ముప్పు లేదు. దీంతో ఈ నెల 12వ తేదీన బల పరీక్షను ఎదుర్కొనేందుకే సీఎం ఫడణవీస్ మొగ్గు చూపుతున్నారు.