శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందంటే..!

 

శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ల మాదిరిగానే ఖనిజాలు కూడా అవసరం అవుతాయి.  శరీరానికి చాలా అవసరమైన ఖనిజాలలో మెగ్నీషియం ముఖ్యమైనది.  మెగ్నీషియం లోపించడం వల్ల శరీరంలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.  శరీరంలో మెగ్నీషియం లోపిస్తే దాన్ని హైపోమాగ్నేసిమియా  అని పిలుస్తారు.  ఇది చాలా రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.  శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

మెగ్నీషియం కండరాల సంకోచాలను నియంత్రిస్తుంది.  దీని లోపం కారణంగా కండరాల తిమ్మిరి,  బలహీనత తీవ్రమవుతాయి. ఇవి రూజువారి జీవనశైలిని చాలా ఇబ్బంది పెడతాయి.

మెగ్నీషియం శరీరం శక్తివంతంగా ఉండటంలో సహాయపడుతుంది. కానీ  మెగ్నీషియం లోపిస్తే తీవ్రమైన అలసట,  నీరసం ఏర్పడతాయి.  చాలా బలహీనంగా అనిపిస్తుంది.  ఏ చిన్న పని పూర్తీ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది.

గుండె ఆరోగ్యం గా ఉండాలన్నా  మెగ్నీషియం తప్పనిసరిగా అవసరం.  ఇది గుండె స్పందనను, రక్తపోటును సక్రమంగా ఉండేలా చేస్తుంది. అదే మెగ్నీషియం లోపిస్తే హృదయ స్పందన  రేటు తారుమారు అవుతుంది.  రక్తపోటు కూడా అస్తవ్యస్తంగా మారుతుంది.

ఒత్తిడి, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మెగ్నీషియం తప్పనిసరిగా అవసరం.  అదే మెగ్నీషియం లోపిస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.  అసహనం, కోపం, చిరాకు, ఒత్తిడి మొదలైన సమస్యలు పెరుగుతాయి. అంతేకాదు.. మెగ్నీషియం లోపం ఉన్నవారికి ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి.  బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సరిగా నిద్రపట్టకపోవడం,  జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు కూడా కలుగుతాయి.


                                       *రూపశ్రీ.

 

గమనిక:


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...