పాలకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

 

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆకు కూరలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు. ఆకుకూరలలో పాలకూర చాలా ఆదరణ పొందింది. పాలకూరను కేవలం పప్పు గానే కాకుండా పనీర్ కూరలు,  పాలక్ చపాతీ, పాలకూర పులావ్.. పాలకూరను నాన్ వెజ్ తో కలిపి వండటం వంటి ప్రయోగాలు కూడా చేస్తుంటారు. పాలకూర ఆరోగ్యానికి చాలామంచిది.అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని పాలకూరను ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదట. పాలకూర ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే..

పాలకూరలో అధిక మొత్తంలో ఆక్సలేట్లు ఉంటాయి. దీని కారణంగా పాలకూరను అధికంగా తింటే కిడ్నీల రాళ్లు ఏర్పడే ప్రమాదం.  కొందరు పాలకూర తినడానికి సంకోచించేది కూడా ఈ కారణంతోనే. మరీ ముఖ్యంగా ఇప్పటికే రాళ్ల సమస్య ఉన్నా.. వంశంలో ఎవరికైనా రాళ్ల సమస్య ఉన్నా..  పాలకూర తినడం మానేయడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు.


గిన్నెడు పాలకూరను వండినా అది ఓ కప్పు అంత మాత్రమే అవుతుంది.  ఇది వేడికి చాలా మెత్తగా అయిపోతుంది.  అయితే పాలకూరను తినడం వల్ల కొందరిలో గ్యాస్, ఉబ్బరం,  అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఇది జీర్ణం కావడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.  ఇప్పటికే జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్ ,  ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు పాలకూరను తినడం మంచిది కాదు.

థైరాయిడ్ సమస్య ఉన్నవారికి  పాలకూర అస్సలు మంచిది కాదు.. పాలకూరలో గోయిట్రోజెన్లు ఉంటాయట.  ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీస్తాయి. దీని కారణంగా థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే పాలకూరను  అతిగా తినకూడదు.

పాలకూర తినడం వల్ల అలెర్జీ కూడా ఉంటుంది.  కొందరికి పాలకూర తినడం వల్ల శ్వాస తీసుకోవడంలో  ఇబ్బంది,  చర్మం పైన దురద, దద్దుర్లు రావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.  పాలకూరను ఎక్కువగా వినియోగించని వారు.. ఆకుకూరలంటే ఇష్టం ఉన్నవారు పాలకూరను ఎడాపెడా తినకూడదు.

గమనిక:

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

                                                  *రూపశ్రీ.