దురదృష్టంలో అదృష్టం..  మా గొడవ పవన్ కు మంచే చేసిందా? 

ఉరుము ఉరిమి మంగళం  మీద పడినట్లు ‘మా’ ఎన్నికల గోల జనసేన చీఫ్ పవన్ కల్యా ణ్ కు మంచే చేసిందా? మెగా ఫ్యామిలీ మంచు ఫ్యామిలీల మధ్య తలెత్తిన వివాదం, ఆ రెండు వర్గాల  మధ్య పిచ్చాపిచ్చగా సాగుతున్న  రచ్చ ఇప్పుడు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపుతుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ, సినిమా, మీడియా వర్గాల విశ్లేషకులు.  

నిజానికి, ‘మా’ ఎన్నికల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష్యంగా అంతగా  జోక్యం చేసుకోలేదు.’మా’ మురికిలో ఆయన కాలు కాదు కదా వేలు కూడా పెట్టలేదు. అయినా, ఆయనకూ బురద అంటింది. ఆ అన్నయ్యకు తమ్ముడిగా పవన్ కళ్యాణ్’ కూడా మెగా సెగ తగిలినట్లే ఉందని అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి ప్రతినిధిగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రభావం చూపేలా ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు  కొత్తగా మా ఎన్నికల రచ్చ పర్యవసానంగా తెర మీదకు వస్తున్న ‘ఆత్మ’ (ఆంధ్రా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) సినిమా  రాజకీయాలను కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా కుల సమీకరణలు, రాజకీయ, సినిమా అనుబంధ సంబంధాల పరంగా పెద్ద మార్పులే వస్తాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్  రాజకీయాలపై మా’ ఎన్నికల ప్రభావం నెగటివ్’గా మాత్రమె కాదు పాజిటివ్’గా కూడా ఉంటుందని, ముఖ్యంగా.. ఈ వివాదం కారణంగా కాపులు ఇతర బీసీ కులాలు, పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా ర్యాలీ అయ్యే అవకాశం ఉందని  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

వెతకబోయిన తీగ కాళ్ళకు తగిలింది అన్నట్లుగా, ఈనెల 23వ తేదీన హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం అధ్వర్యంలో జాతీయ స్థాయి బీసీ నాయకుల సదస్సు జరుగుతోంది. ఈ సదసుకు నిర్వాహకులు వన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళవారం తనను కలిసిన బీసీ నాయకులతో పవన్ కళ్యాణ్ తమ మనసులోని భావాలను పంచుకున్నారు. బీసీల అజెండానే తన అజండా అనే అభిప్రాయం కలిపించే విధంగా పవన్ కళ్యాణ్ మాటలున్నాయి. కేవలం ఉద్యమాలు చేయడం కాదు, రాజ్యాదికారం కోసం, కొట్లాడాలని అన్నారు. బీసీలను ఏకం చేయాలనే రాజకీయ కోరిన ఆయన  మనసులో ఉందని చెప్పకనే చెప్పారు. అలాగే బీసీల పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.   ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2024 ఎన్నికల సమయానికి బీసీలు స్పష్టమైన అజెండాతో ఉండాలన్నారు. 

అంటే కుల రాజకీయాలు అంటేనే  ఛీ అనే పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికల నాటికీ ఒక బలమైన బీసీల రాజకీయ వేదికగా జనసేనను నిలిపే ప్రయత్నాలో ఉన్నారని తెలుస్తోంది. బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు జన సేన సంపూర్ణ మద్దతు ఉంటుందని,   అధికారానికి దూరంగా ఉన్న కులాల కోసం పని చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.సో .. మా’ వివాదంతో  పవన్ కళ్యాణ్ ఇమేజ్’ కొంత మసకబారినట్లు అనిపించినా, ఫార్ట్యూన్ ఇన్ డిజ్గైజ్, దురదృష్ట్రంలో అదృష్టంలాగా సక్రమంగా వినియోగించుకుంటే మా’ గోడవ పవన్ కళ్యాణ్’కు కీడుకంటే మేలే ఎక్కువ చేసిందని అంటునారు.