మందలో వచ్చి.. ముందు నిలబడిన ‘ఇప్పాల’

చెప్పకుండా వచ్చినందుకు షాక్ ఇచ్చిన లోకేష్

అత్యంత హేయంగా, నీచంగా, ద్వేష భావంతో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇప్పాల రవీంద్రరెడ్డి నేడు నారా లోకేష్ ముందు ప్రత్యక్షమై ఒక బిజినెస్ మీటింగ్ చేశారు.  అయితే రవీంద్రారెడ్డి అని లోకేష్ కి తెలియకపోవచ్చు. కానీ ఆలస్యంగా విషయం తెలుసుకున్న లోకేష్ మందలో వచ్చి తనకు ఝలక్ ఇచ్చిన రవీంద్రకు అంతే వేగంగా షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు. 

వ్యాపార సమావేశం నిమిత్తం మంగళవారం (మార్చి 25) సిస్కో కంపెనీ ప్రతినిథులు కొందరు మంత్రి నారా లోకేష్ ని కలిశారు. అదే కంపెనీలో సౌత్ ఇండియా టెరిటరీ ఎక్కౌంట్స్ మేనేజర్ గా ఉన్న ఇప్పాల కూడా ఆ బృందంలో ఒక సభ్యుడిగా హాజరయ్యారు. ఈ విషయం గమనించని లోకేష్ అతడిని కంపెనీ సభ్యుడిగానే భావించారు. మాట్లాడి పంపించారు. ఇది గమనించి సోషల్ మీడియా హైలైట్ చేయడంతో షాక్ అయిన లోకేష్ వెంటనే  ‘సిస్కో’ కపెనీకి ఆప్పాలను ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ విధమైన ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీభాగస్వామిని చేయవద్దని లేఖ రాశారు. ఆ విధంగా లోకేష్ ప్రతి స్పందించారు. లోకేష్ సిబ్బందికి, అధికారులకు అతను ఎవరో తెలియక పోవచ్చు కానీ, మంత్రి లోకేష్ వద్దకు ఏదైనా క ంపెనీ ప్రతినిథుల బృందాన్ని పంపేటప్పుడు వారెవరో తెలుసోవడంలో సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విఫలమైందని తెలుగుదేశం అభిమానులు విమర్శిస్తున్నారు.