డీఎస్ గీతని కేసీఆర్ చెరిపేస్తారా..?

డి శ్రీనివాస్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసారు.. రాష్ట్ర విభజన అనంతరం అప్పటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ ను వీడి తెరాసలో చేరారు.. అయితే డీఎస్ తెరాసలో ఇమడలేకపోయారనేది వాస్తవం.. తెరాసలో తనకి తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని డీఎస్ భావన.. మరోవైపు తెరాస నేతలు, కార్యకర్తలు కూడా డీఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్నారు.. తాజాగా నిజామాబాద్ తెరాస నేతలు, ఎంపీ కవితతో సమావేశమై డీఎస్ మీద తమకున్న అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.. డీఎస్ గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో డీఎస్ మంతనాలు జరుపుతున్నారని నిజామాబాద్ నేతలు ఆరోపించినట్టు తెలుస్తుంది.. అదే విధంగా డీఎస్ మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాసారంట.. మరి డీఎస్ మరియు నిజామాబాద్ నేతల మధ్య ఏర్పడిన ఈ గీతని తెరాస పెద్దలు చెరిపేస్తారో లేక డీఎస్ ని దూరం చేసుకుంటారో చూద్దాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu