కుల్‌భూషణ్‌ కేసు..ఐసీజే తీర్పు నేడే

 

కుల్ భూషణ్ జాదవ్ కేసులో నేడు అంతర్జాతీయ న్యాయ స్థానం తీర్పు ఇవ్వనుంది. గూఢాచార్యం ఆరోపణల కింద పాక్ కుల్ భూషణ్ జాదవ్ ను అరెస్ట్ చేసి అతనికి మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈనెల 8న పిటిషన్ దాఖలు చేయగా..15న ఒకరోజు విచారణ జరిగింది. ఎటువంటి ఆధారాలు చూపకుండా పాకిస్థాన్ శిక్ష విధించిందని భారత్ వాదనలు చేసింది. దీనికి గాను గూఢచారులకు అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవంటూ పాక్‌ ప్రతివాదన చేసింది. ద హేగ్‌లోని పీస్‌ ప్యాలెస్‌లో మధ్యాహ్నం 12 గంటలకు న్యాయస్థానం అధ్యక్షుడు రోన్నే అబ్రహాం తీర్పు చదువుతారని ఐసీజే వర్గాలు తెలిపాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu