కేంద్రమంత్రి అనిల్ మధవ్ దవే మృతి.. మోడీ దిగ్ర్భాంతి..
posted on May 18, 2017 10:31AM

కేంద్రమంత్రి అనిల్ మాధవ్ దవే మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాధవ్ దవే ఈరోజు ఉదయం కన్నుమూశారు. .మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకుప్రస్తుతం కేంద్ర పర్యావరణ, అటవీశాఖమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికైన మాధవ్ దవే..కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. కాగా మాధవ్ దవే 1956 జులై 6న మధ్యప్రదేశ్ బాద్ నగర్ లో జన్మించారు.
ఇదిలా ఉండగా మాధవే దవే మృతికి బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మాధవ్ దవే మృతికి దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిన్న సాయంత్రం వరకు దవేతో తాను మాట్లాడనని, ఎన్నో ముఖ్యమైన విషయాలు చర్చించుకున్నామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఇకలేరనే వార్త వ్యక్తిగతంగా తనను ఎంతగానో వేదనకు గురిచేస్తోందన్నారు.