నిశిత్ కారు.. జర్మనీ టీమ్ విచారణ..

 

ఏపీ మంత్రి నారాయణ కుమరుడు నిశిత్ నారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతి వేగమే మృతికి కారణమని ఇప్పటికే పోలీసులు తేల్చి చెప్పేశారు. అయితే ఇక్కటి వరకూ బాగానే ఉన్నా నిశిత్ ప్రయాణిస్తున్న బెంజ్ కారు అత్యాధునికి ఫీచర్లు అన్నీ కలిగి ఉండి...ప్రమాదంలో ఈ సదుపాయాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునేలా తయారు చేశారు. కానీ  ప్రమాద సమయంలో కారులో బెలూన్లు పని చేయకపోవడం, ప్రమాదంలో కారులో ఉన్న నిషిత్, అతడి స్నేహితుడు మరణించడంతో కారు సాంకేతికతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏకంగా జర్మనీ నుండే ఓ టీమ్ వచ్చి  ప్రమాదం జరిగిన ప్రాంతంలో విచారణ చేపట్టారు. కారును పరిశీలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu