కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అవార్డ్

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ప్రముఖ మీడియా సంస్థ "బిజినెస్ వరల్డ్" ఆయనను "లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌"కు ఎంపిక చేసింది.  తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, హారితహారం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను కేటీఆర్ విజయవంతంగా నిర్వహిస్తున్నందున ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు బిజినెస్ వరల్డ్ ప్రకటించింది. ఈ నెల 20న ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ కేటీఆర్‌కు వర్తమానం పంపింది. మరోవైపు ఉత్తమ పట్టణ మౌలిక వసతులున్న రాష్ట్రంగా తెలంగాణకి మరో అవార్డు కూడా దక్కింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu