టీడీపీలోకి కొణతాల, గండి?

 

విశాఖ జిల్లాలకు చెందిన సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ, మరో నాయకుడు గండి బాబ్జీ త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. వైసీపీకి గుడ్ బై కొట్టిన తర్వాత కొణతాల రామకృష్ణ ఏ పార్టీలోనూ చేరకుండా వున్నారు. ఇప్పుడు టీడీపీ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆయన త్వరలో టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. మంగళవారం ఉదయం ఏపీ మంత్రం అయ్యన్నపాత్రుడు కొణతాల రామకృష్ణను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకి తీసుకుని వెళ్ళారు. ఈ భేటీలో కళా వెంకట్రావు కూడా పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu