బస్సు - విమానం ఢీ!

 

నిజమే... ఆకాశంలో తిరిగే విమానం, నేల మీద తిరిగే బస్సు ఢీకొన్నాయి. ఇలాంటి ఘటనలు ఏ విదేశాల్లోనో జరుగుతాయని అనుకుంటాం. కానీ ఇది మన ఇండియాలోనే జరిగింది. అయితే ఇది మరీ వింత సంఘటన కాదు.. ఎందుకంటే, బస్సు  - విమానం ఢీకొంది ఆకాశంలోకాదు.. నేలమీదే! కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ బస్సు రన్ వే మీద వున్న విమానాన్ని ఢీకొంది. ఈ విమానం సిల్చార్ నుంచి అస్సోం వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు బస్సు డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu