బెడిసి కొట్టిన కిరణ్ వ్యూహం!
posted on Apr 23, 2011 12:49PM
హై
దరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ప్రచారానికి మహిళా మంత్రులను పులివెందులలో దించాలనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం కూడా బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. పులివెందులలో వైయస్ వివేకానంద రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయలేమనే కన్నా వైయస్ విజయమ్మకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేమని వారు ముఖ్యమంత్రికి తేల్చి చెప్పినట్లు సమాచారం. విజయమ్మకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తమ పట్ల వ్యతిరేకత ఎదురవుతుందని వారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, మహిళా మంత్రులు చాలా మంది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే రాజకీయాల్లో ప్రధాన పోషించగలుగుతున్నారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వంటి మహిళా మంత్రులకు రాజశేఖర రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వైయస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కూడా వారిని వెనక్కి లాగుతున్నట్లు చెబుతున్నారు. వైయస్ విజయమ్మతో మహిళా మంత్రులకు చాలా మందికి దగ్గరితనం ఉంది. అందువల్ల ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం తమ వల్ల కాదని అంటున్నట్లు తెలుస్తోంది.