ఇకపై కిరణ్ బేడీని కలవకూడదు..
posted on Jun 5, 2017 5:11PM

తమ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామికి మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఈ విబేధాలు మరోసారి బయటపడ్డాయి. పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియలో కిరణ్ బేడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై స్పందించిన నారాయణస్వామి.. పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియలో అనవసరంగా కిరణ్‌బేడీ జోక్యం చేసుకుంటున్నారని... కిరణ్ బేడీని ఇక అధికారులెవ్వరూ కలవకూడదని, ఒకవేళ తప్పనిసరి అయితే ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని ఆదేశించారు.
ఇక నారాయణ స్వామి వ్యాఖ్యలకు స్పందించిన కిరణ్ బేడీ అదే తరహాలో సమాధానమిచ్చారు. ‘మీరు కోరుకుంటున్నది రబ్బర్ స్టాంపునా లేదా బాధ్యతాయుతమైన పాలకురాలినా’ అని నారాయణస్వామిని అని ప్రశ్నించారు.