ప్రజల కోసం చెట్టెక్కిన కేంద్రమంత్రి

ఒక స్థాయి నేత అయ్యుండి...జనంలో కాస్త పలుకుబడి ఉంటే చాలు ఆయన గారు రాజాగారిలా ఫీలైపోతారు. అది కావాలి..ఇది చెయ్యండి అంటూ ఆర్డర్స్ వేస్తారు. చోటా మోటా నాయకులే ఇలా ఉంటే మరి కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకేలా ఉంటారు. కాని తాను కేంద్రమంత్రిని అని తెలిసికూడా ప్రజల కోసం చెట్టెక్కారు అర్జున్ రామ్ మేఘవాల్. ఇంతకీ ఆయనకీ చెట్టు ఎక్కాల్సిన అవసరం ఏంటా అనుకుంటున్నారా..?

 

రాజస్థాన్‌లోని తన నియోజకవర్గం బికనీర్‌లో పర్యటించిన ఆయన ఢోలియా గ్రామంలో ప్రజల సమస్యలను విన్నారు. తమ గ్రామంలోని ఆస్పత్రిలో నర్సులు తగినంతగా లేరని గ్రామస్తులు చెప్పడంతో సమస్య పరిష్కారం కోసం మేఘవాల్ సంబంధిత ఉన్నతాధికారికి ఫోన్ చేశారు. అయితే, మారుమూల గ్రామం కావడంతో సెల్ సిగ్నల్స్ అందలేదు. ఆయన పరిస్థితిని గమనించిన గ్రామస్తులు..సిగ్నల్ రావాలంటే చెట్టు ఎక్కాల్సిందేనని, చెట్టు ఎక్కితేనే ఎంతో దూరంగా ఉన్న టవర్ నుంచి సిగ్నల్ అందుతుందని అన్నారు. దీంతో ఒక నిచ్చెన సాయంతో ఆయన చెట్టు ఎక్కి అధికారితో మాట్లాడి కిందకు వచ్చారు. ఇది చూసిన గ్రామస్తులు మేఘవాల్‌కు జిందాబాద్‌లు కొట్టారు. అప్పట్లో తన నివాసం నుంచి పార్లమెంట్‌కు సైకిల్‌పై వచ్చి మేఘవాల్ సంచలనం సృష్టించారు అంతేకాదు ప్రధాని నుంచి ప్రశంసలు అందుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu