రాష్ట్రంలో కల్లోలానికి గోవధే కారణమట?
posted on Apr 4, 2012 8:36AM
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని వున్న అల్లకల్లోల పరిస్థితులకు కారణం రాజేకీయ నాయకులు కాదట. రాష్ట్రంలో నిత్యం వందలాది గోవులను వధించడంవల్లే ఈ దుస్థితి దాపురించిందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి అంటున్నారు. గత మూడేళ్లుగా రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఆయన అంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణానికి, అనంతరం వచ్చిన వరదలకు, తరువాత సంభవించిన సకలజనుల సమ్మెకు ... ఇలా ... ప్రతి వైపరీత్యానికి కారణం గోవులను వధించడం వల్లేనని ఆయన అంటున్నారు.
శ్రీరాముడు గోవులను బాగా పోషించాడని అందువల్లే ఆయన రాజ్యం సుభిక్షంగా ఉండేదన్నారు. కిరణ్ ప్రభుత్వం కూడా వెంటనే గోవధను నిలిపివేస్తే రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడతాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నా గోవధను అరికట్టలేకపోవడం వల్లే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన సెలవిచ్చారు.