మాజీ ఎంపీ కిల్లి కృపారాణి భర్త, కుమారుడిపై కేసు

కిల్లి కృపారాణి.. ఇప్పుడంటే ఈ పేరు వినిపించడం లేదు కానీ కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పేరు తెగ వినిపించేది.. ఎంపీగా, కేంద్ర మంత్రిగా కృపారాణి చక్రం తిప్పారు. అయితే రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదం ఈమె రాజకీయ భవిష్యత్తును సమాధి కట్టింది. అలాంటి కృపారాణి పేరు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. విశాఖపట్నంలోని సి. డాల్ అపార్ట్‌మెంట్‌‌ను కృపారాణి కుటుంబసభ్యులు కబ్జా చేశారంటూ అపార్ట్‌మెంట్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె భర్త డాక్టర్ రామ్మోహన్ రావు, కుమారుడు విక్రాంత్‌లపై అక్రమ చొరబాటు, బెదిరింపు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.