కేజ్రీవాల్ కు న్యాయమూర్తి మద్దతు.. బస్సులో అవసరమైతే నడుచుకుంటూ వెళ్తాం..
posted on Dec 7, 2015 10:54AM

ఢిల్లీలో కాలుష్యం బాగా పెరిగిపోయిందని.. దానిని నివారించేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ సరికొత్త ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోజు విడిచి రోజు వాహనాలు నడపాలని.. ఒక రోజు సరి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజు బేసి సంఖ్య ఉన్న వాహనాలు మాత్రమే నడపాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ పద్దతిని జనవరి 1 నుంచి అమలుచేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. అయితే కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్ల నుండి చాలా విమర్శలే వచ్చాయి. కానీ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మాత్రం మద్దతు తెలిపారు. ఢిల్లీలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు తాము సిద్దంగా ఉన్నామని.. అందుకు కోర్టుకు బస్సులో వెళ్లడానికైనా సిద్దమే అని.. అవసరమైతే నడుచుకుంటా కూడా వెళతామని అన్నారు. కాగా జస్టిస్ టీఎస్ ఠాకూర్ తమ పథకానికి మద్దతు తెలిపినందుకు కేజ్రీఆల్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.