కేజ్రీవాల్ కారు దొరికిందోచ్..
posted on Oct 14, 2017 11:40AM

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కారు చోరికి గురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సెక్రటేరియట్ దగ్గర ఉన్న నీలిరంగు వ్యాగన్-ఆర్ కారును ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడని డిసిపి చెప్పారు. అయితే ఎట్టకేలకు చోరీకి గురైన కారు దొరికింది. ఘజియాబాద్‌లోని మోహన్ నగర్ సమీపంలో కారును పోలీసులు గుర్తించారు. అయితే.. కారును ఎవరు దొంగిలించారనే విషయం మాత్రం తెలియలేదు. కాగా దీనిపై కేజ్రీవాల్ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను ప్రశ్నించారు. ‘కారుకే భద్రత లేకపోతే.. ఇక సామాన్యుడి మాటేంటి? కారు పోవడం చిన్న విషయమే.. కానీ అది సచివాలయం ఎదుట పోయింది. దిల్లీలో శాంతి, భద్రతలు గాడితప్పుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనం’ అని కేజ్రీవాల్ ఎల్‌జీకి లేఖ రాశారు.