కేజ్రీవాల్ కు గట్టి షాకిచ్చిన రాం జఠ్మలానీ...


ఆప్ అధినేత కేజ్రీవాల్ కు గట్టి షాకే తగిలింది. కేజ్రీవాల్ పై అరుణ్ జైట్లీ వేసిన పరువునష్టం దావా కేసుపై గత కొద్ది రోజులుగా విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కేసును కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది రాం జఠ్మలానీ వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ కు తీవ్రమైన షాకిచ్చారు రాం జఠ్మలానీ. తను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని.. తనకు ఫీజుగా రావాల్సిన రూ. 2 కోట్లను వెంటనే చెల్లించాలని అల్టిమేట్టం ఇచ్చి కేజ్రీవాల్ ను మరింత చిక్కుల్లోకి నెట్టారు. ఇందుకు కారణం..  కోర్టులో జైట్లీని ప్రశ్నిస్తూ, రాం జఠ్మలానీ చేసిన వ్యాఖ్యలపై.. జైట్లీని అవమానించేలా మాట్లాడాలని రాం జఠ్మలానీకి చెప్పలేదని.. వాటితో తనకు సంబంధం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాం జఠ్మలానీ కేసు నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అంతేకాదు..  కేసు నుంచి తప్పుకున్నాను కాబట్టి, మిగిలిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి.