కొనసాగుతున్న జలవిలయం
posted on Jun 22, 2013 10:29AM

కేదారేశ్వరుడి సాక్షిగా గంగ సృష్టించిన విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది.. సునామిలా విరుచుకుపడిన మందాకినీ నది అలలు వందాల ప్రాణాలు తీయటంతో పాటు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేయగా. ఇప్పుడు మిగిలిన ఆ ఆనవాలు కూడా మృత్యు ఘంటికలను మోగిస్తున్నాయి..
ఇప్పటికే సైన్యం ప్రాణాలకు తెగించి వేల ప్రాణాలను కాపాడినా.. ఇంకా దాదాపు 50 వేలకు పైగా ప్రజలు అక్కడే చిక్కుకొని ఉన్నారు.. అయితే ఇంత వరకు రవాణా మార్గాలు సరిచేయలేకపోవడం.. వాతవరణ పరిస్థితులు కూడా సహకరించకపోవటంతో మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది..
ఇప్పటి వరకు మరణించిన వారిలో సంగ మంది అలల తాకిడికి మరణించగా అంతే మంది ఆకలి దప్పులతో మరణించారు.. అయితే ఇప్పటికీ చాలా మంది మార్గమధ్యంలోనే ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.. ముఖ్యంగా యాత్రకు వెళ్లిన వారిలో వృద్దులు మహిళలే ఎక్కవుగా ఉండటంతో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది..
ప్రభుత్వంతో పాటు పలు స్వఛ్చంద సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నా అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా అవి బాధితులకు అందటం చాలా కష్టమవుతుంది..