శంకరన్న పై మరో కేసు

 

Defamation case against Shankar Rao, Shankar Rao case,  Shankar Rao congress

 

 

కాంగ్రెస్‌ మాజీ మంత్రి శంకర్రావుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.. హైకమాండ్‌ అండదండలతో జగన్‌ను జైలు పాలు చేసిన శంకర్రావు ఆ తరువాత పార్టీ నాయకులను కూడా పట్టించుకోకుండా అందరి మీద ఆరోపణలు మొదలుపెట్టాడు..

 

దీంతో పార్టీ పెద్దలు కూడా శంకర్రాపును పక్కన పెట్టారు.. అయితే తనకు సరైన విలువ దక్కటం లేదన్న శంకర్రావు ఏకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డినే టార్గెట్‌ చేసి అనేక ఆరోపణలు చేశాడు.. దీంతో పార్టీకి దూరమయిన శంకర్రావు కేసులకు మాత్రం చాలా దగ్గరయ్యాడు.



ఇప్పటికే భూకబ్జా కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్న శంకర్రావును.. కొడలు రూపంలో మరో కేసు వెంటాడింది.. తనను హెరాస్‌ చేస్తున్నారంటూ కొడలు వేసు వేసిన కేసు శంకరన్నతో పాటు ఆయన కుంటుంబానికి కూడా చుట్టుకుంది.. ఇదే వరుసలో ఆయన మెడకు ఇప్పుడు తాజాగా మరో కేసు చుట్టుకుంది..



గతంలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరి సియం, డిజిపిలపై అక్రమంగా సంపాదిస్తున్నారంటూ ఆరోపణలు చేసిన శంకర్‌రావుపై డిజిపీ కార్యాలయంలోని అసిస్టెంట్‌ ఐజీ ఆఫ్‌ పోలీస్‌ ఎం సుబ్బారావు కేసు ఫైల్‌ చేశారు..

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu