తమిళ పురచ్చితలవై జయమ్మ కరుణ

.....గోపి చిల్లకూరు.డల్లాస్ టెక్సాస్

 

Jayalalitha Boon to Tamilnadu People, Jayalalitha Offers Breakfast Food, Water at minimum rates, Jaya govt offers 'Amma Mineral Water' at Rs 10 a litre

 

 

భారత్ లో మీరు  ఏ పట్టణం లో సెటిల్ అవ్వాలను  కొంటున్నారో ఇంకా నిర్ణయం తిసుకొలేదా ! ఎందుకు ఆలస్యం తమిళనాడు మద్రాసు నగరంలోకి మకాం మార్చేయండి. ఆదాయంతో పనిలేకుండా బహు భేషుగ్గా బతికేయచ్చు, శెభాష్ జయలలితమ్మ, నమస్కారం, వణక్కం అంటూ !  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారు వరుసగా ప్రకటిస్తున్న అమ్మటిఫిన్, అమ్మలంచ్, అమ్మమినరల్ వాటర్, అమ్మ వెజిటబుల్ అవుట్ లెట్స్  పథకాలు చూస్తుంటే !


 1) బ్రేక్ ఫాస్ట్  1-3 రూపాయల లోపు(ఇడ్లి, దోస, పొంగలు, పూరి ..etc )నచ్చిన టిఫిన్స్ 
    లంచ్       5-8 రూపాయలలోపు
    డిన్నర్    5 -8రూపాయలలోపు
    మినరల్ వాటర్ సగం ధరకే !
    రోజుకు 12 రూపాయలతో ఒక మనిషి బ్రతికేయచ్చు !

 

మీకు పై అమ్మ హోటల్ లో రోజూ తినలేకపోతే వారానికి ఒకసారి అమ్మ Vegetables outlet   స్టోర్స్ లో సగం ధరకే కూరగాయలు.

 

 1)  బియ్యం ఎలాగు కేజీ 2 రూపాయలు మంచిగా బిరియాని వండుకొని పండుగ చేసుకోవచ్చు !
 2) ప్రతి ఫామిలీకి ఇచ్చే ఉచిత టీవితో జయటీవీ  సీరియళ్ళు అన్ని ఫ్రీగా చుసేయవచ్చు
3) మీ పిల్లలకిచ్చే ఉచిత laptopతో చాటింగ్ లేదా సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ లు  చేసేయవచ్చు !
4) ఓటు మాత్రం జయలలిత అమ్మకే వేసేయండి ! ఈసారి మనకు వంటకు గ్యాస్ కూడా ఫ్రీగా వస్తుంది.

 

అమ్మ ఇంకొంచెం కరుణ చూపిస్తే   ప్రతి రోజూ వండిన వెజిటేరియన్  భోజనం మూడు పూటల మన  ఇంటికి వస్తుంది.   అమ్మ దయతలిస్తే  ఆదివారం  చికెన్ లేదా  మటన్  భోజనం కూడా  వస్తుంది.
పేద ప్రజలకు భోజనం సరసమైన ధరలకు అందిచడం మంచిదే కాని వారిని ఎన్నికల దృష్టితో  మరీ  సోమరిపోతులను చేయడం తగదు అన్నది రచయత భావన.
అదే విధముగా ఈ పథ కాల  ద్వార రాష్ట్ర ఖజానాకు నష్టం రాకుండా చేస్తే అత్యంత ఉపయోగమైన పథకములు అవుతాయీ !. 


ప్రతి చోట అమ్మ హోటల్స్ పెట్టి  ఇడ్లిబండిలు , చిన్న హోటల్స్, చిరు అంగడిలు నడిపే వారు అందరు నష్టపోయే అవకాశం వుంది.  ఇప్పటికే తమిళనాడు గత సంవత్సరం లోటుబడ్జెట్  దాదాపు 23వేల  కోట్లు. ఈ సంవత్సరం ఇప్పటికే  భోజన పథకం ఖర్చు 5000 కోట్లు.

 

లోక్ సభ ఎన్నికలు త్వరలో  వస్తున్నాయని ఇన్ని పథకాలు ఇలాగే పెడితే రాష్ట్రం దివాలా తీయడం ఖాయం.  చైనాలో ఒక  పాత  సామెత "ఒక మనిషికి చేపలు వండి ఒక పూట భోజనం  పెట్టడం కంటే అదే మనిషికి చేపలు పట్టడం నేర్పితే  ఆ వృత్తి  అతనికి  జీవితాంతం తిండి పెడుతుంది" అన్న సామెత ప్రభుత్వాది నేతలు గుర్తు పెట్టుకొంటే మంచిది.

 

(“Give a man a fish and you feed him for a day. Teach a man to fish and you feed him for a lifetime.)


Online Jyotish
Tone Academy
KidsOne Telugu