ఆ ఆడపిల్లని ఐదుగురు కుర్రాళ్లు మూడురోజుల పాటు...

 

తస్మాత్‌ జాగ్రత్త! రోజులసలే బాగోలేవు. ఇది మనం చెబుతున్న మాట కాదు. అంతర్జాతీయ సర్వేలు కూడా మన దేశంలో ఆడవాళ్ల పరిస్థితి ఏమంత సురక్షితంగా లేవని హెచ్చరిస్తోంది. భేషజానికి పోయి ఈ నిజాన్ని పట్టించుకోకుండా ఉంటే.. రేపు పొద్దున మన ఇంట్లోకే ప్రమాదం వచ్చేయవచ్చు. ఈ వార్తే అందుకు సాక్ష్యం. హిమాచల్‌ ప్రదేశ్‌లో 12వ తరగతి చదువుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఓ మూడు రోజుల పాటు కనిపించకుండా పోయారు. తీరా వాళ్లని వెతికి పట్టుకున్నాక, వాళ్లు చెప్పిన విషయాన్ని విని పోలీసులు అవాక్కైపోయారు. వాళ్లలో ఒకరిని ఐదురుగు కుర్రవాళ్లు మూడు రోజుల పాటు రేప్‌ చేసి, ఆ తర్వాతే వదిలిపెట్టారని తెలిసింది. బాధితులు చెప్పిన దాని ప్రకారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ని రిజిస్టర్‌ చేసి ముగ్గురు నిందితులను మాత్రమే పట్టుకోగలిగారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu