బంద్‌కు పిలుపునిచ్చిన కేసీఆర్
posted on Jun 14, 2013 3:36PM
తెలంగాణవాదులపై ప్రభుత్వం, పోలీసులు ప్రవర్తించిన తీరును నిరసిస్తూ ఈ నెల 15న తెలంగాణ బంద్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బంద్‌కు అన్ని వర్గాలు బంద్‌కు సహకరించాలని, బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణవాదులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. జేఏసీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణవాదుల అరెస్టులను కేసీఆర్ ఖండించారు. అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉదయం నుండి తెలంగాణ వ్యాప్తంగా జరగుతున్న అన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బంద్ కు నిర్ణయం తీసుకున్నామని అయన అన్నారు.ఈ రోజు తాము ఛలో అసేంబ్లీకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు నిరసనగా రేపు తెలంగాణ బంద్ కు పిలుపు ఇస్తున్నటు ఉస్మానియా విశ్వవిద్యాలయ జేఏసీ పిలుపునిచ్చింది.