జాతీయ రాజకీయాలకు విరామం.. తాత్కాలికమేనా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల తారకరామారావుకు తత్వం బోధపడినట్లుంది. జాతీయ రాజకీయాలలో రాణించాలంటే.. తెలంగాణ మోడల్ ప్రచారం ఒక్కటే సరిపోదన్న విషయం తెలిసి వచ్చినట్లుంది. అందుకే ఆ ఎన్నికల తరువాత ఆయన కేంద్రంపై విమర్శలను బంద్ చేశారు. రాష్ట్రంలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాలు, ఆరునెలలలోగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సొంత పార్టీలో ఇబ్బందులను పరిష్కరించుకునే ప్రయత్నాలలో పడ్డారు.

అన్నిటికీ మించి ఇంత కాలం ఆయన ఏకైక అజెండాగా తీసుకున్న బీజేపీ వ్యతిరేక స్టాండ్ కు కూడా ఫుల్ స్టాప్ లేదా కామా పెట్టేశారు.  రాష్ట్రంలో బీజేపీలో సమస్యలు తక్కువ ఏమీ లేవు. సిట్టింగులకు టికెట్ల విషయంలో పార్టీలో  తలెత్తిన అసంతృప్తి ఇప్పటిలో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే.. కేసీఆర్ వ్యూహ వైఫల్యమో, యాంటీ ఇంకంబెన్సీ ఫలితమో తెలియదు కానీ తెలంగాణలో  కాంగ్రెస్, బీజేపీలు బలంగా పుంజుకున్నాయి.

రెండు పార్టీలూ కూడా వేటికవి కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకు వెళుతున్నాయి. బీజేపీ  రాష్ట్రంలో ఈ స్థాయిలో బలోపేతం కావడానికి కేసీఆరే కారణమని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి. కాంగ్రెస్ ను విస్మరించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ అంతా బీజేపీపై పెట్టడం వల్లనే రాష్ట్రంలో బీజేపీ ఈ స్థాయిలో బలోపేతం అయ్యిందన్న వాదన పరిశీలకుల నుంచి కూడా వస్తోంది. కేసీఆర్ ఈ వైఖరి కారణంగానే గతంలో అంటే టీఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్ గా మారడానికి ముందు నుంచే తెలంగాణలో కేసీఆర్ పార్టీ బీజేపీకి బి.టీమ్ అన్న విమర్శలు సైతం వెల్లువెత్తాయి.

అయితే ఆ తరువాత ఆ విమర్శల జోరు క్రమంగా తగ్గి కనుమరుగైపోయింది. అయితే ఇటీవలి కాలంలో అంటే కర్నాటక ఎన్నికల తరువాత నుంచి కేసీఆర్ ధోరణి కారణంగా మళ్లీ అవే అనుమానాలూ, విమర్శలూ తెరమీదకు వస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కోసం కేసీఆర్ బీజేపీకి సరెండర్ అయ్యారా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తమౌతున్నాయి. ఆశ్చర్యకరంగా కేసీఆర్ నోట మోడీకి కానీ, బీజేపీకి కాని వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రావడం లేదు. దీంతో ఆయన జాతీయ రాజకీయాలకు ప్రకటించిన విరామం తాత్కాలికమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu