నాని వర్సెస్ చిన్ని.. కేశినేని బ్రదర్స్ పొలటిక్స్
posted on Jun 7, 2023 9:33AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయినా.. నవ్యంధ్రాలో అయినా.. విజయవాడ.. విజయవాడే. ఆ బెజవాడ మహానగరం విద్యలకే వాడ కాదు.. తెలుగు రాజకీయానికి కూడా గుండెకాయ వంటింది. ఇంకా చెప్పాలంటే.. బెజవాడ రాజకీయం అంటే యమా రంజుగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందనే కంటే.. విజయవాడ లోక్‌సభ సభ్యుడిగా ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే నగరంలోని ఎమ్మెల్యే సీట్లు.. ఏ పార్టీ ఖాతాలో వెళ్లాయనే అంశంపైనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వారు ఆసక్తిగా గమనిస్తారనడంలో ఏ మాత్రం కించిత్ సందేహం కూడా లేదన్న విషయం విధితమే. దీనిని బట్టే సుస్పష్టమవుతోందీ.. బెజవాడ రాజకీయానికి డిమాండ్ ఎక్కువని.
అలాంటి విజయవాడలో రాజకీయం స్థానిక లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని వర్సెస్ ఆయన సోదరుడు కేశినేని చిన్ని అన్నట్లుగా తయారైందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో ఊపందుకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేశినేని నాని మరింత దూకుడుగా వ్యవహరిస్తుండడంతో.. అదీకూడా.. తన లోక్‌సభ నియోజకర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు మైలవరం, నందిగామల్లో పర్యటిస్తూ... జగన్ పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ప్రశంసల జల్లు కురిపించడం... అలాగే అదే పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయ్యోధ్య రామిరెడ్డి.. సైతం కేశినేని నాని తమ పార్టీలోకి వస్తే.. స్వాగతిస్తామని ప్రకటించడం.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతా, టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చుకున్నా తనకు అభ్యంతరం లేదంటూ బహిరంగ ప్రకటనలు చేయడం.. వంటి వాటి వల్ల.. అటు సైకిల్ పార్టీకి జరిగే నష్టం కంటే.. ఇటు సోదరుడు కేశినేని చిన్నికి కలిగే ఇబ్బందుల కంటే.. కేశినేని నానికే భారీగా.. అదీ వ్యక్తిగతంగా నష్టం వాటిలే అవకాశాలు ఉన్నాయనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది.
రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో, అలాగే జగన్ వేవ్‌లో అంటే 2019 ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇక ఈ రెండు ఎన్నికల్లో జగన్ పార్టీ.. తన లోక్‌సభ అభ్యర్థులను మార్చినా.. పసుపు పార్టీ మాత్రం కేశినేని నానికే వరుసగా సీటు ఇస్తూ వచ్చింది. అలాంటి పార్టీ నుంచి ఎన్నికై... నేడు అదే పార్టీ పట్ల ఇంతలా అంటి ముట్టనట్లుగా వ్యవహరించడం వల్ల.. కేశినేని నాని ఇమేజ్‌కే డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందనే టాక్ సైతం వైరల్ అవుతోంది.
రాజకీయ అన్న తర్వాత గ్రూపులు.. రాజకీయ పార్టీలు అన్న తర్వాత... గ్రూప్ పాలిటిక్స్ అత్యంత సహజమని.. అలాంటి వేళ... అదీ కూడా సొంత ఇంట్లోని వ్యక్తి.. అదీ సోదరుడు కేశినేని చిన్నిని కూర్చొబెట్టుకొని మాట్లాడితే.. జస్ట్ పది నిమిషాల్లో అన్ని సమస్యలు అల్ క్లియర్ అయిపోతాయనే చర్చ సైతం సాగుతోంది. కానీ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారాన్ని వదిలేస్తే.. కొన్ని అరాచక శక్తులు బరిలోకి దిగితే... ఆ తర్వాత జరిగే పరిణామాలకు మనమే బాధ్యత వహించాల్సి ఉంటుందనే అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇప్పటికే పాదయాత్రలో ఒక్కే ఒక్క చాన్స్ అంటూ.. చాలా హామీలు ఇవ్వడంతో.. అలా అధికారంలోకి వచ్చిన వారి వల్ల.. రాష్ట్రానికి ఏ మేరకు మేలు జరిగిందంటే.. మాత్రం ఆలోచించాల్సిందే. ఇటువంటి నేపథ్యంలో వారిద్దరికి సర్థి చెప్పాల్సిన భాద్యత పార్టీలోని నేతలపైన సైతం ఉందనేది సుస్పష్టం.
ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా గాలీ వీస్తుంది.. అలాంటి వేళ.. ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీని అధికార పక్షంలోకి తీసుకొచ్చేందుకు కలిసి కట్టుగా ఎంత చేయాలో.. అంత చేయాలని.. అలా అయితేనే మనం, మన పార్టీ అధినేత అనుకొన్న లక్ష్యానికి చేరువవుతామనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఏమండోయి నానీ గారు.. ఏమండోయి చిన్ని గారు..కలిసి మళ్లీ పూర్వాశ్రమంలో పని చేసుకొంటూ వెళ్లాలని పోలిటికల్ సర్కిల్లో ఓ అబిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.