కేసీఆర్ డేరింగ్ స్టెప్.. 105 మంది అభ్యర్థుల ప్రకటన.!!

 

కేసీఆర్ ఏం చేసినా సంచలనమే.. ఓ వైపు అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లి చరిత్ర సృష్టించడానికి సిద్దమైన కేసీఆర్.. మరో డేరింగ్ స్టెప్ వేశారు.. అందరూ ఊహించినట్టు 30, 40 కాదు ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి తప్పితే మిగతా అందరికి అవకాశం ఇచ్చారు.. నల్లాల ఓదేలు( చెన్నూరు), బాబూమోహన్‌(ఆందోల్‌)కు టికెట్లు నిరాకరించినట్టు ప్రకటించారు.. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు ఉండగా తొలి విడుతలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించటం విశేషమనే చెప్పాలి.