Karthika Deepam2 : అదే రెస్టారెంట్ కి వచ్చిన రెండో భార్య, వాళ్ళ కూతురు.. షాక్ లో భర్త!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -85 లో.. నువ్వు వారం రోజులు స్కూల్ కి వెళ్లొద్దని శౌర్యతో దీప చెప్పగానే.. అప్పుడే కార్తీక్ వస్తుంటాడు. ఎందుకు వద్దు అంటున్నారని అడుగుతాడు. నర్సింహా గురించి చెప్తే పోలీస్ కంప్లైంట్ అంటాడని ఏం లేదు బాబు.. మా ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నానని దీప చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ తో మాట్లాడను అని శౌర్య అనగానే.. ఎందుకని కార్తీక్ అంటాడు. నేను స్కూల్ కి రమ్మని చెప్పాను.. ఎందుకు రాలేదని శౌర్య అడుగుతుంది. నేను రానందుకు నాకు పనిష్మెంట్ ఇవ్వమని కార్తీక్ అనగానే.. ఇంకొకసారి ఇలా చేయనని ప్రామిస్ చేయమని శౌర్య అంటుంది. కాసేపటికి ఇంకొకసారి బాధ పెట్టనని కార్తిక్ ప్రామిస్ చేస్తాడు.

నువ్వు స్కూల్ లో బాగా మాట్లాడవటా కదా ఇదిగో చాక్లెట్ అని కార్తీక్ ఇస్తాడు. నాతో పాటు నిన్ను రెస్టారెంట్ కి తీసుకొని వెళ్తానని కార్తీక్ అంటాడు. మీరు కూడ రండి అని దీపతో కార్తీక్ అనగానే.. నేను రానని దీప చెప్తుంది. శౌర్యని ఒక్కదాన్ని పంపించలేను.. అలా అని వాళ్ళతో వెళ్ళలేనని దీప అనుకుంటుంది. కార్తీక్, శౌర్య బలవంతం చెయ్యడంతో నేను వస్తానని దీప అంటుంది. మరొకవైపు శివన్నారాయణ జ్యోత్స్న, కార్తీక్ ల ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంటే.. మీ గురించే.. మీ అమ్మ చెప్పలేదా అని సుమిత్ర అంటుంది. ఏం చెప్పావని పారిజాతం అంటుంది. నువ్వు అనుకున్నది అయితే కాదులే అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న రెస్టారెంట్ కి వెళదాం రెడీ అవ్వమని కార్తీక్ అంటాడు. దీప శౌర్యలు కూడా వస్తున్నారని కార్తిక్ అనగానే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు షాక్ అవుతారు.ఆ తర్వాత కావేరిని స్వప్న బయటకు తీసుకొని వెళ్తుంది. ఏ రెస్టారెంట్ కి వెళ్లాలో అర్ధం కాక కార్తీక్ ఫోన్ చేసి అడుగుతుంది. జ్యోత్స్న రెస్టారెంట్ కి రండి నేను ఇక్కడే ఉన్నానని కార్తీక్ చెప్పగానే.. స్వప్న సరే అంటుంది.

ఆ తర్వాత దీప, శౌర్యలు రెస్టారెంట్ కి వస్తారు. మా కార్తీక్ రెస్టారెంట్ చూసావా ఎలా ఉందోనని శౌర్య అంటుంది. మీ అమ్మ పని చేసేది చాలా చిన్నగా ఉంటుందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత మేనేజర్ వచ్చి జ్యోత్స్న, కార్తీక్ ల పెళ్లి గురించి అడుగుతాడు. రెండు నెలల్లో ఉండొచ్చు అని జ్యోత్స్న అంటుంది. అందరు మాట్లాడుకుంటుంటే అప్పుడే స్వప్న, కావేరి వస్తుంటారు. వాళ్ళను దీప చూసి.. ఇప్పుడు శ్రీధర్ గారిని ఫ్యామిలీతో వాళ్ళు చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని వాళ్ళు వస్తున్నారని శ్రీధర్ కి దీప సైగ చెయ్యడంతో.. వాళ్ళు రావడం చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.