జూనియర్ ఎన్టీఆర్ పుత్రోత్సాహం.. ట్విట్టర్‌లో ఆనందం
posted on Jul 22, 2014 11:51PM
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు మంగళవారం ఉదయం పండంటి మగపిల్లాడు పుట్టిన విషయం తెలిసిందే. పుత్రోత్సాహంలో వున్న జూనియర్ ఎన్టీఆర్ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. 2009లో ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ 2010 నుంచి అందులో ఏ ట్విట్స్ పోస్ట్ చేయలేదు. కొడుకు పుట్టగానే జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో ట్విట్ పోస్ట్ చేశారు. ‘‘చాలా కాలం నుండి ట్విట్టర్‌కు దూరంగా ఉంటున్నా. కొడుకు పుట్టిన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా ఈ రోజు మీ అందరితో పంచుకుంటున్నా. ఈ సందర్భంగా మా కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.