భారీ జాతీయపతాకావిష్కరణ చేసిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన దేశంలోనే అత్యంత ఎత్తు, పొడవైన జాతీయ జెండాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా 300 అడుగుల ఎత్తైన జెండా స్తంభంపై 108 అడుగుల పొడవు, 72 అడుగుల వెడల్పుగల జాతీయ పతాకం అందరిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మంత్రివర్గ సహచరులు, అధికారులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu