ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏపీని బజారుకిడ్చారు
posted on Jun 2, 2016 11:47AM
.jpg)
ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్‌ను రోడ్డున పడేశారన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమించారని కాని విభజనా మాత్రం ఆపలేకపోయామన్నారు. విభజన చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరా..రెండు ప్రాంతాలకు న్యాయం చేసి ముందుకెళ్లాలంటే నాటి పాలకులు లెక్కచేయలేదన్నారు. జనాభా ప్రకారం అప్పులు పంచారు, ఆదాయం మాత్రం ఎక్కడిది అక్కడే అన్నారు. విభజన తర్వాత ఆస్తులు రాలేదు..అప్పులు మాత్రమే మిగిలాయన్నారు. నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు ఎన్ని కష్టాలొచ్చినా భయపడేది లేదని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల, సీఎస్ టక్కర్, మంత్రులు దేవినేని, కామినేని, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.