మత్తయ్య కాల్ డేటా ఇవ్వడానికి సమయం కావాలి..

ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరసలేం మత్తయ్య కాల్ డేటా కావాలని సీఐడీ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కోర్టు దానికి అంగీకరించి మత్తయ్యకు సంబంధించిన కాల్ డేటాను సీఐడీ కి ఇవ్వాల్సిందిగా ఎయిర్‌టెల్‌, ఐడియా, రిలయన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మత్తయ్య కాల్‌డేటా ఇచ్చేందుకు నెలరోజుల సమయం కావాలంటూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణను న్యాయస్థానం ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu