లేడి డాక్టర్ కాలర్ సరిచేసిన మంత్రి
posted on Jul 1, 2015 6:20PM

బీజేపీ నేత, జమ్మూ కాశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రి చౌదరీ లాల్ సింగ్ ఓ మహిళా వైద్యురాలి కాలర్ సరిచేసి వార్తల్లో కెక్కారు. ఆయన వైద్యురాలి కాలర్ సరి చేసిన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. వివరాల ప్రకారం.. అమరనాథ్ యాత్ర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా మంత్రి చౌదరీ లాల్ సింగ్ లఖన్‌పూర్ ప్రభుత్వాసుప్రతిని సందర్శించారు. అయితే అక్కడ ఉన్న ఓ మహిళా వైద్యురాలు కాలర్ సరిగా పెట్టుకోలేదు. దీన్ని గమనించిన మంత్రి 'బైటియా నువ్వు కాలర్ సరిగా పెట్టుకోలేదు' అంటూ తన చేత్తో కాలర్ ను స్వయంగా సరిచేశారు. ఇదంతా గమనించిన మరో మహిళా డాక్టర్ మళ్లీ తన కాలర్ ఎక్కడ సరిచేస్తారు అని అనుకుందో ఏమో తనంతట తానే కాలర్‌ను సరి చేసుకుంది. అయితే ఇప్పుడు మంత్రి గారు చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక మహిళ అనుమతి లేకుండా తనను తాకడం పెద్ద నేరమంటూ మంత్రిగారిని తిట్టిపోస్తున్నారు.