ఎయిర్‌పోర్ట్ ఘటనపై జేసీకి చంద్రబాబు క్లాస్
posted on Jul 11, 2017 11:35AM
.jpg)
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో బోర్డింగ్ పాస్ విషయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి దురుసు ప్రవర్తన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..పాస్ నిరాకరించారన్న ఆగ్రహంతో సిబ్బందిని తోసి వేయడమే కాకుండా అక్కడ ఉన్న పరికరాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు జేసీ..దీంతో ఎయిర్‌లైన్ సంస్థలు ఆయనపై ట్రావెల్ బ్యాన్ విధించాయి..ఈ నేపథ్యంలో గత ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్ విమానం ఎక్కిన జేసీని కిందకి దించేశారు..ఈ విషయం టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి రావడంతో ఆయన జేసీని విజయవాడ పిలిపించుకుని మాట్లాడారు. విమానాలు ఎక్కకుండా విధించిన ట్రావెల్ బ్యాన్ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. అవసరమైతే విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో మాట్లాడాలన్నారు.