కలకలం రేపుతున్న జయలలిత వీడియో..
posted on Dec 20, 2017 10:16AM
.jpg)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం.. ఆమె మరణానికి సంబంధించి పలు వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి ఇది తెరపైకి వచ్చింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న వీడియో ఒకటి విడుదలైంది. దినకరన్ వర్గం ఎమ్మెల్యే వేట్రివేల్ ఈ వీడియోను విడుదల చేశారు. జయలలితకు సరైన వైద్యం అందలేదని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. జయలలిత చికిత్సకు సంబంధించి మాదగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి.. కావాలనే మాపై దుష్ర్పచారం చేస్తున్నారు.. మాపై దుష్ర్పచారం చేసే వాళ్లకి కూడా వాస్తవాలు తెలుసు అని వేట్రివేల్ అన్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు బయటపెడతాం అని చెబుతున్నారు. ఇక ఈ వీడియోలో జయలలిత కూర్చొని ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ వీడియో పెద్ద సంచలనంగా మారింది. ఆర్కే నగర్ ఉపఎన్నిక ఒకరోజు ముందు ఈ వీడియో విడుదల చేయడంతో కలకలం రేగుతోంది.