రాష్ట్రపతి నోట బాహుబలి మాట
posted on Dec 19, 2017 7:07PM
.jpg)
బాహుబాలి.. బాహుబలి రెండు మూడేళ్ల నుంచి ఇండియాతో పాటు ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన ఫీవర్. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న చిన్నారుల నుంచి పెద్దల బుర్రలను తొలిచేసింది. ఇందుకు ప్రముఖులు కూడా మినహాయింపు కాదు. అలాగే ఒక ప్రాంతీయ భాషా చిత్రం రెండు వేల కోట్ల రూపాయల ను వసూలు చేసి తెలుగు సినిమాతో పాటు తెలుగువారి సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. గత ఐదు రోజుల నుంచి హైదరాబాద్‌లో వైభవంగా జరుగుతున్న తెలుగు మహా సభల ముగింపు వేడుకల్లోనూ బాహుబలి ప్రస్తావన వచ్చింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. తెలుగు భాష గొప్పదనాన్ని వర్ణిస్తూ.. తెలుగు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి సత్య నాదెళ్ల దాకా.. తెలుగువారి సత్తాను ప్రశంసించారు. సోదర సోదరీ మణులరా..? అని తెలుగులో మాట్లాడి.. తనకు హైదరాబాద్ అనగానే మంచి బిర్యానీ, పచ్చళ్లు, బాహుబలి గుర్తొస్తాయన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు.