జమ్మూలో ఉగ్రవాది దాడి, ఒక బి.యస్.యఫ్. జవాను మృతి
posted on Aug 5, 2015 9:52AM
గత మూడు దశాబ్దాలుగా భారతదేశం మీద పాకిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తూనే ఉంది. అక్కడ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్ పైకి పంపిస్తూ అనేక వందల మందిని బలిగొంటోంది. అయినా దాని రక్తదాహం తీరడం లేదు. మళ్ళీ ఈరోజు ఉదయం జమ్ములో ఉదంపూర్ జిల్లాలో శ్రీనగర్ జాతీయ రహదారిపై నరసు నాలా వద్ద సరిహద్దు భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ఒక బి.యస్.యఫ్.జవాను మరణించగా మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే జవాన్లు కూడా ఎదురుదాడి చేసి తమపై దాడికి పాల్పడ్డ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన జమ్మూ&కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా “ఈ దాడి జరిగిన జాతీయ రహదారిలో ఉగ్రవాదుల దాడి జరిగి చాలా కాలమే అయ్యింది. ఎందుకంటే ఆ ప్రాంతాల నుండి ఉగ్రవాదులను ఎరివేయబడ్డారు. కానీ మళ్ళీ ఇప్పుడు దాడి జరగడం చాలా ఆందోళన కలిగిస్తోంది,” అని ట్వీట్ మెసేజ్ చేశారు.