నిలకడగా తిరుపతి తొక్కిసలాట క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి

తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని   స్విమ్స్ సూపరింటెండెంట్ రవి కుమార్ వెల్లడించారు. క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులలో ఓ ముగ్గురు మాత్రం మూడు రోజుల అబ్జర్వేషన్లో ఉండాలన్నారు. 

మిగిలిన వారందరినీ త్వరలో డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. రుయా ఆస్పత్రి నుంచి స్విమ్స్ కు మొత్తం 13మందిని తరలించారు. వారందరికీ చికిత్స జరుుగతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్విమ్స్ కు వచ్చి  క్షతగాత్రులను పరామర్శించనున్నారు.