కారు కమలం మధ్య జై శ్రీరామ్ నినాద వివాదం ..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు జై శ్రీరామ్ నినాదాన్ని వివాదం చేశాయి. మమతా బెనర్జీ పాల్గొన్న సభలలో, ఆమె కాన్వాయ్ వెళ్ళే దారిలో ఎవరైనా జై శ్రీరామ్ నినాడం చేస్తే, ముఖ్యమంత్రి అదేసాల్ మేరకు పోలేసులు కొన్ని వందల మందిని అరెస్టు చేశారు. ఒకటి రెండు  రెండు సందర్భాలలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారు దిగి, జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. 

మరో సందర్భంలో ప్రధాని మోడీతో కల్సి పాల్గొన్న నేతాజీ సుభాష్ చంద్రబోసు 125 జయంతి వేడుకల్లో, మంట బెనర్జీ ప్రసంగించేందుకు లేవగానే, సభలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఆమెను రెచ్చగొట్టారు. మమత ఆగ్రహంతో ఊగి పోయారు. ప్రధాని సమక్షంలోనే బీజేపీ కార్యకర్తాల్పై విరుచుకు పడ్డారు. జై శ్రీరామ్ ఆనం నేరానికి, వారిని వెలుపలకు పంపిస్తేనే, ప్రసంగించనని బీష్మించుకు కూర్చున్నారు. దీంతో, నేతాజీ జయంతి వేడుకలకంటే, మమతా బెనర్జీ సృష్టించిన జై శ్రీరామ్  వివాదంమే మీడియాలో ఫోకస్ అయింది. ఇలా ఆనేక సందర్భాలో మమత బెనర్జీ, బీజేపీ మధ్య జై శ్రీరామ్, నినాదం వివాదంగా మారింది.నిజానికి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జై శ్రీరామ్ నినాదాన్ని , ఇరు పార్టీలు ఎన్నికల అస్త్రంగా ఉపయోగించుకున్నాయి.  

అయితే ఇప్పుదు ఈ విషయం ఎందుకంటే, తెలంగాణలోనూ జై శ్రీరాం నినాదం వివాదం, ఎన్నికల నినాదం   అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ నాయకులు, ఎక్కడికి వెళ్ళిన, ఏ సమావేశంలో అయినా, జై శ్రీరామ్ అంటూనే ప్రసంగం మొదలు పెడతారు. భారత్ మాతాకే జై అంటూనే ముగిస్తారు. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన ఆచారం కాదు. అద్వానీ రధయాత్ర రోజుల నుంచి, కాషాయ దళం జై శ్రీరామ్ నినాదాన్ని సొంతం చేసుకుంది. ఇతర లౌకికవాద పార్టీలు కూడా  జై శ్రీరామ్ అనే సాహసం చేయలేదు. జై శ్రీరామ్ అంటే తమ లౌకిక ప్రాతివత్సం మైల పడిపోతుందని, ఆ నినాదం జోలికి వెల్ల లేదు.  అయితే, గతంలో ఎవరూ అంతగా పట్టించుకోకపోయినా, ఇప్పుడు దేశం అంతటా లౌకిక వాదం తెరమరుగై, హిందుత్వ వాదం బలం పుంజుకుంటున్న నేపధ్యంలో, జై శ్రీరామ్ నినాదం హిందువులను ఏకం చేస్తోందని అన్ని పార్టీలు గుర్తించాయి. ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్, జై శ్రీరామ్ నినాదాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా, ఈ విషయంలో బీజేపీతో పోటీ పడుతున్నారు. అలాగే, ఇతర పార్టీలు కూడా, గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ ఓటు బ్యాంక్ ఏకీకృతం అవుతున్న నేపధ్యంలో, ఇష్టం ఉన్నా లేకున్నా, మెల్లమెల్లగా హిందుత్వ, జాతీయవాద రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా స్వాతంత్ర ఉద్యమ కాలంలో, వందేమాతరం  నినాదం ఎలా అయితే భారతీయులు ఏకం చేసిందో జైశ్రీరామ్, నినాదం ఇప్పుడు హిందువులను ఆ విధంగా ఏకం చేస్తోంది. ఈ కొత్త రాజకీయ పోకడ కొన్ని రాష్ట్రాలలో ఎక్కువ, కొన్ని రాష్ట్రలలో తక్కువగ ఉన్నా దేశంలో బీజేపీ ఎదుగుదలలో కూడా జై శ్రీరామ్ నినాదం శక్తివంతమైన ఆయుధంగా పనిచేసింది. పనిచేస్తోంది. ఇది ఎవరో కాదనలేని నిజం.  

అందుకే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీని ఎదుర్కోవడంలో భాగంగానే ( బెంగాల్లో చాలావరకు నియోజక వర్గాల్లో ముస్లిం ఓటు నిర్నయటక స్థాయికి చేరింది)  మమతా బెనర్జీ, జై శ్రీరామ్ నినాదాన్ని, తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు తెలంగాణలో తెరాస నాయకత్వం జై శ్రీరామ్’ నినాదానికి కౌంటర్’ గా జై హనుమాన్’ నినాదాన్ని ఎత్తుకుంది. బీజేపే కార్యకర్తలు జై శ్రీరామ్ అంటే మనం జై హానుమాన్ అనాలని, తెరాస ఎమ్మెల్సీ కవిత తమ పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. బీజేపీ నేతలు తమను రెచ్చగొట్టేందుకు జైశ్రీరాం అని నినాదాలు ఇస్తున్నారని వారు అలా అంటే మనం జై హనుమాన్ అనాలని ‌కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు.ఇటీవల కవిత కొండగట్టు హనుమాన్ ఆలయాన్ని ప్రత్యేకంగా దర్శించుకుంటున్నారు. హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొన్నారు. కేసీఆర్, హిందూగాళ్ళు , బొందుగాళ్ళు, అని హిందూ సమాజాన్నిఅవహేళన చెసినా , బీజేపీని హిందూ మతోన్మాద పార్టీగా చీదరించుకున్నా అయన కుమార్తె కవిత మాత్రం బీజేపీ బాటలోనే జై హనుమాన్; నినాదాన్ని రాజకీయ నినాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  

అయితే బీజేపే నాయకులు నాయకులు కార్యకర్తలు కవిత జై హనుమాన్ అన్నా జై శ్రీరామ్ అన్నా తమకు అభ్యంతరం లేదని అంటున్నారు. అలాగే, రాజకీయలకోసంగా కాకుండా, భక్తితో, చిత్తశుద్ధితో అంటున్నారా అనేదే అనుమాన మని అంటున్నారు. గతంలో రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ‘నేనే నిజమైన హిందువును,యగ్నోపవీత ధారినీ’ అన్నా, పెద్ద పెద్ద బొట్లు పెట్టి దేవాలయాల చుట్టూ  ప్రదక్షిణలు చేసినా ప్రజలు నమ్మలేదన్న విషయాన్నీ గుర్తు చేస్తున్నారు.