ఆ ముప్పియ్యారు పేర్లేంటి జగ్గూ?
posted on Jul 25, 2024 4:37PM
దొంగలముఠా నాయకుడు జగ్గు తన దొంగల ముఠాకి చెందిన ముప్పియ్యారు మందిని అధికార పార్టీ వాళ్ళు చంపేశారని అంటూ చెవి కోసిన మేకలాగా లబోదిబో అంటున్నాడు. వంక దొరకనమ్మ డొంకని పట్టుకుని ఏడ్చిందన్నట్టు నీ వ్యవహారం వుంది. నీ దరిద్రపు బుద్ధి, నువ్వు, నీ నీచ నికృష్ట బ్యాచ్ చేసిన దారుణాల కారణంగానే నువ్వు ఈరోజు సర్వనాశనం అయిపోయావు. అయినప్పటికీ నీకు బుద్ధి రాలేదు. నోటికొచ్చిన వాగుడు వాడుతూ, ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తూ... నీ బుద్ధి, కుక్కతోక సేమ్ టు సేమ్ అని ప్రూవ్ చేసుకుంటున్నావ్. నీ పరువు స్టేట్ లెవల్లో తీసుకుని సరిపెట్టుకోకుండా, సెంట్రల్ లెవల్లో కూడా తీసుకున్నావ్. నోరు తెరిస్తే చాలు.. ముప్పియ్యారు.. ముప్పియ్యారు.. అంటావే తప్ప, ఆ ముప్పియ్యారు పేర్లేంటో చెప్పవయ్యా బాబూ అంటే ‘టాపిక్ డైవర్ట్ చేయొద్దు’ అంటూ నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావ్. ఆ ముప్పియ్యారు మంది పేర్లేంటో చెప్పు నాయనా, విచారణ జరిపిస్తామని అధికార పార్టీ వాళ్ళు అంటుంటే చప్పుడు చేయవేంటి? మొత్తం చనిపోయినవాళ్ళు నలుగురు. వాళ్ళలో ముగ్గురు అధికారపార్టీ వాళ్ళు, ఒకరు నీ పార్టీ వాళ్ళు అని అధికారికంగా కూడా చెబుతున్నారు కదా? నువ్వు అన్నట్టుగా ముప్పియ్యారే కరెక్టు అయినప్పుడు ఆ పేర్లేంటో చెప్పు జగ్గూ! ప్రూవ్ చేసుకునే సత్తా లేనప్పుడు ఈ చెత్త వాగుడు అంతా వాగడం ఎందుకు? నీ లోపల బుద్ధి, సిగ్గు, మానం, అభిమానం, గౌరవం లాంటివేవైనా మిగిలి వుంటే, ముప్పియ్యారు.. ముప్పియ్యారు అని మొత్తుకోవడం కాకుండా, ఆ ముప్పియ్యారు మంది పేర్లు ఇవ్వు. వాళ్ళు నీ పార్టీలో ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నారో చూపించు. అప్పుడు అరువు ముప్పియ్యారు.. ముప్పియ్యారు... అని. ఇలా చేయలేకపోతే చప్పుడు చేయకుండా కూర్చో!