స్పందించకపోతే రాష్ట్ర బంద్... వైఎస్ జగన్

 

వైకాపా పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సంఘాలకు తమ మద్ధతు తెలిపారు. రైతు భరోసా యాత్రలో ఉన్నఆయన మంగళవారం అనంతపురం బస్టాండ్ వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తన మద్ధతు ఉంటుందని, నాలుగు రోజుల్లో స్పందించకపోతే రాష్ట్ర బంద్ ఉంటుందని తెలిపారు.