భారీ ల్యాండ్ స్కామ్ లో జబర్దస్త్ నటి రీతూ చౌదరి?!

ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసిన భారీ ల్యాండ్ స్కామ్ లో బుల్లితెర నటి, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి బుక్ అయ్యారు. విజయవాడ, ఇబ్రహీం పట్నం కేంద్రంలో ఓ ముఠా 700 కోట్ల రూపాయల భూ దందాకు పాల్పడింది. ఇందుకు సంబంధించి కేసు కూడా నమోదైంది. ఆ కేసులో రీతూ చౌదరి పేరు కూడా ఉంది.  ఓ రిటైర్డ్  సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఆ స్కామ్ వెలుగు చూసింది. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారంటూ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ నేరుగా చంద్రబాబుకు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు చీమకుర్తి శ్రీకాంత్, ఆయన రెండో భార్య వనం దివ్య అలియాస్ రీతూ చౌదరితో పాటు సీఎంకు వరుసకు సోదరుడయ్యే   వైఎస్‌ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి కూడా ఈ స్కామ్ లో ఉన్నారని పేర్కొన్నారు.

 రిటైర్డ్  సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్  ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గోవాలో తనను బంధించి బలవంతంగా రూ.700 కోట్ల రూపాయల ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నది రిటైర్ట్ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ సీఎంకు లేఖ ద్వారా చేసిన ఫిర్యాదు సారాంశం. ఇప్పుడు ఆ ఫిర్యాదుపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రితూ చౌదరి అడ్డంగా బుక్కయ్యారని అంటున్నారు.  జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ  వచ్చిన రీతూచౌదరి భారీ ల్యాండ్ స్కామ్ లో ఉండటం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.