గుర్తుపట్టడానికి వీల్లేకుండా 47 మృతదేహాలు
posted on Oct 26, 2017 5:12PM
ఇండోనేషియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి 47 మంది సజీవ దహనమయ్యారు. దేశ రాజధాని జకార్తా సమీపంలోని తంగెరాంగ్ ప్రాంతంలో గల ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం 9 గంటలకు ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్షణాల్లోనే అవి భవనం మొత్తం వ్యాపించాయి. ఏటు చూసినా పొగ.. ఊపిరాడకపోవడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మంటల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడి వచ్చేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 47 మంది అగ్నికీలలకు ఆహుతవ్వగా.. 43 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 103 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు సమాచారం. మరణించిన వారిలో చాలామంది మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా కాలిపోయాయి. కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.